
ఘనంగా బక్రీద్ పండగ
త్యాగాల ఫలితమే బక్రీద్ పండుగ..
వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీ
షబ్బీర్ అలీ కి వివిధ పార్టీ నాయకులు బక్రీద్ శుభాకాంక్షలు
కామారెడ్డి యువతరం ప్రతినిధి;
కామారెడ్డి పట్టణంలోని కోర్ట్ ఆవరణలో గల ఈద్గాలో బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ చేసి అందరికి బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి మహమ్మద్ అలీ షబ్బీర్
ఈ సందర్భంగా షబ్బీర్ అలీమాట్లాడుతూ
త్యాగాలకు ప్రతీక బక్రీద్ పండుగ సమష్టి ప్రయోజనం కోసం వ్యక్తిగత స్వార్థాన్ని విడిచి త్యాగాలకు సిద్ధపడటమే సమాజ హితమని,
త్యాగాల ద్వారా ప్రాప్తించిన ప్రయోజనాలు సమస్త జనులకు సమానంగా అందినప్పుడే ఆ త్యాగాలకు సార్థకత చేకూరుతుందనే సందేశాన్ని బక్రీద్ పండుగ విశ్వమానవాళికి అందిస్తున్నదని తెలిపారు.
బక్రీద్ పండుగ భక్తి, త్యాగం, కరుణ, విశ్వాసం అనే గొప్ప గుణాలను ప్రజల్లో పెంపొందిస్తుందని అన్నారు.
సకల మతవిశ్వాసాలను, సంప్రదాయాలను గౌరవిస్తూ రాష్ట్రంలో దేశంలో పాలన కొనసాగాలని పేర్కొన్నారు.
అన్నివర్గాల ప్రజలు శాంతియుతంగా కలిసిమెలసి జీవించేలా, గంగా జమునా తహజీబ్‌ను కాపాడుకుంటూ అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అల్లాతో ప్రార్థించానని అన్నారు.
తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగాలని అల్లా దయ ప్రజలందరిపై ఉండాలని, ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.