ఎరుకల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకై చంద్రబాబు నాయుడు హామీ
టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతి

ఎరుకల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకై చంద్రబాబు నాయుడు హామీ
టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి
వెంకటపతి
తుగ్గలి యువతరం విలేఖరి;
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టీలలో ఎరుకుల కులస్తులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్లు టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతి తెలిపారు. గురువారం విజయవాడలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏకలవ్య జయంతి ఉత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాలకు టిడిపి జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అలాగే తుగ్గలి మండలం నుండి టిడిపి ఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి వెంకటపతి తోపాటు పలువురు పాల్గొన్నారు. ఏకలవ్య జయంతి ఉత్సవాలలో చంద్రబాబు నాయుడు ఎస్టీలలో ఎరుకుల కులస్తులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చినట్లు వెంకటపతి తెలిపారు.