ANDHRA PRADESHCRIME NEWS
అక్రమ మద్యం విక్రేతలు అరెస్ట్

అక్రమ మద్యం విక్రేతలు అరెస్ట్
వెల్దుర్తి యువతరం విలేఖరి;
వెల్దుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయినపల్లి, గోవర్ధనగిరి గ్రామాలలో కోడుమూరు సెబ్ అధికారులు మరియు స్థానిక పోలీస్ అధికారులు కలిసి సంయుక్తంగా దాడులు చేశారు. ఈ దాడిలో ఇద్దరు మహి మహిళా విక్రేతలను
అరెస్టు చేసి వారి దగ్గర నుండి కర్ణాటక రాష్ట్రానికి చెందిన 64 డిప్స్ ఒరిజినల్ చాయిస్, ఢిలక్స్ విస్కీ టెట్రా ప్యాకెట్స్ లను స్వాదీనము చేసుకొని కేసు నమోదు చేసి , అరెస్టు చేయబడిన ముద్దాయిలను రిమాండ్ నిమిత్తం డోన్ ఎక్సైజ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచడం జరిగినట్లు వెల్దుర్తి ఎస్సై చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.