ప్రజా సమస్యల పరిష్కారాలపై నిర్లక్ష్యం చూపొద్దు
ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్

ప్రజా సమస్యల పరిష్కారాలపై నిర్లక్ష్యం చూపొద్దు.
స్పందన వచ్చిన అర్జీలను గడవు లోపు పరిష్కారం అయ్యేటట్టు చర్యలు తీసుకోండి.
స్పందన అర్జీలను నాణ్యతగా పరిష్కరించండి.
ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్
ఆదోని యువతరం ప్రతినిధి;
స్పందన అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులకు సూచించారు. వచ్చిన అర్జీలను ఏ ఒక్క అధికారి నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించి అర్జిదారులను సంతృప్తిపరిచేలా చూడాలని ఆదోని సబ్ కలెక్టర్ సూచించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం నందు స్పందనలో పాల్గొని డివిజన్లోని ఆయా మండలాల నుంచి వచ్చిన ప్రజల నుండి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ… జగనన్నకు చెబుదాం, స్పందన గ్రీవెన్స్ లను గ్రామ స్థాయి పూర్తి అయ్యే సమస్యలు డివిజన్ స్థాయి వరకు వస్తున్నారు. నాణ్యతతో గ్రామస్థాయిలోనే సమస్యలను పరిష్కరించాలన్నారు. మండలంలోని ఆయా శాఖల అధికారులకు సంబంధించిన సమస్యలను తెలియజేస్తూ గడువు లోపు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బియాండ్ ఎస్ ఎల్ ఏ లోకి వెళ్లకుండా చూడాలన్నారు.
స్పందన అర్జీల్లో సమస్యలు కొన్ని సమస్యలు
ఆదోని మండలం చిన్న హరివాణం గ్రామానికి చెందిన విజయలక్ష్మి కి సంబంధించి సర్వేనెంబర్ 64. E.B.3 నందు 1.5 ఎకరాల భూమిని ఆన్లైన్ అడంగల్ నందు నమోదు చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
నందవరం మండలం నాగలదిన్నె గ్రామానికి చెందిన ఖాసీంబీ కి 2009 సంవత్సరం నందు ప్రభుత్వం వారు ఇంటి పట్టా మంజూరు చేశారు. అయితే వేరే వారు పేరు మీద కూడా ఇంటి పట్టా ఉందని దౌర్జన్యం చేస్తున్నారు కావున ఇరువురి పట్టాలను పరిశీలించి న్యాయం చేయవలసినదిగా ఆర్జి సమర్పించుకున్నారు.
మంత్రాలయం మండలం రచ్చమర్రి గ్రామానికి చెందిన మేకల లింగప్ప సంబంధించి సర్వేనెంబర్ 548 నందు 1.30 ఎకరాల భూమి ఉన్నది ప్రభుత్వ నిబంధనలు ప్రకారం ఒక బోరుకు మరొక బోరుకు 200 మీటర్ల దూరం ఉండాలని ఉంది అయితే నా పక్కన పొలం వారు నా యొక్క బోర్ నుండి 18 మీటర్ల దూరంలోనే బోరు వేస్తున్నారు కావున వీటిపై చర్యలు తీసుకొని న్యాయం చేయవలసినదిగా అర్జీ సమర్పించుకున్నారు.
ఈ కార్యక్రమంలో కార్యాలయపు సీనియర్ సహాయకులు రామయ్య, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, గృహ నిర్మాణ శాఖ డిప్యూటీ ఇంజనీర్ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ చేతన్ ప్రియా, బిసి వెల్ఫేర్ లక్ష్మి నారాయణ, తదితర అధికారులు పాల్గొన్నారు.