
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులు పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి
జిల్లా కలెక్టర్ అనుదీప్
భద్రాద్రి జిల్లా, యువతరం ప్రతినిధి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సోమవారం ఐ డి ఓ సి కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి సమస్యల వినతులు స్వీకరించాలి. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న ప్రజావాణి దరఖాస్తులననుసరించి పర్యవేక్షణ చేయాలని డిఆర్ఓ అశోక్ చక్రవర్తికి సూచించారు. ప్రజావాణిలో సమస్య పరిష్కారం కోరుతూ ప్రజలు
అందచేసిన దరఖాస్తులు కొన్ని :-
భద్రాచలం మండలం, భద్రాచలం గ్రామానికి చెందిన తోకల వెంకటేశ్వర్లు వయస్సు 60 సంవత్సరాలు తను ప్రైవేటు డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నానని 2021 వ సంవత్సరంలో కరోనా రావడం జరిగిందని, ఎడమ కాలుకు బ్లాక్ ఫంగస్ సొకిందని వైద్యులు చెప్పడం వలన తన ఎడమ కాలు తొలగించడం జరిగిందని తనకు భార్య ఆరోగ్యం బాగోలేని కుమారుడు ఉన్నాడని వాళ్ళ యొక్క పోషణ బాధ్యత తన మీద ఉన్నదని తన యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేనందువలన తనకు దళిత బంధు పథకం కింద ఏదైనా లబ్ది చేకూర్చినట్లైతే తన కుటుంబ పోషణకు ఉపయోగపడుతుందని దరఖాస్తు చేసుకున్నారు. ఇట్టి దరఖాస్తును కలెక్టర్ తగు చర్యల నిమిత్తం ఈడి ఎస్సీ కార్పొరేషన్ అధికారులు కు ఎండార్స్ చేయడం జరిగింది.
జూలూరుపాడు మండలం షేక్ రహీమున్నీ దమ్మపేట సెంటర్లో గల ఎస్టీ బాలుర గురుకుల పాఠశాలలో జూన్ 2022 నుండి ఏప్రిల్ 2023 స్వీపర్ గా పనిచేస్తున్నానని.తన యొక్క భర్త ఆరోగ్య పరిస్థితి బాగోలేదని తన యొక్క కుటుంబ పోషణకు తన మీద ఆధారపడి ఉందని అందుకుగాను ఈ సంవత్సరం కూడా అదే పాఠశాలలో స్వీపర్ గా కొనసాగించాలని దరఖాస్తు చేసుకున్నారు. ఇట్టి దరఖాస్తులను పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం దరఖాస్తును డిస్టిక్ ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ కు ఎండార్స్ చేయడం జరిగింది.
కొత్తగూడెం మండలం, కొత్తగూడెం 14 వ వార్డు చెందిన పటాన్ రుబీనా బేగం నేను వితంతువునని నాకు ఇద్దరు కుమార్తెలు,నేను కిరాయి ఇంట్లో ఉంటున్నానని నా యొక్క ఆర్థిక పరిస్థితి బాగోలేనందువలన నాకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయవలసిందిగా దరఖాస్తు చేసుకున్నారు. ఇట్టి దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం డిఆర్ఓ కు ఎండార్స్ చేశారు.
టేకులపల్లి మండలం భీమ్ సింగ్ తండా కు చెందిన ధరావత్ రామి గత 20 సంవత్సరములుగా కిరాయి ఇంట్లో నివాసం ఉంటున్నామని ఒక గుంట స్థలం ఉన్నదని దానిలో ఇంటి నిర్మాణం చేసుకొనుటకు గాను గృహ లక్ష్మీ పథకం కింద నిధులు మంజూరు చేయవలసిందిగా దరఖాస్తు చేసినారు. ఇట్టి దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్య నిమిత్తం డిఆర్ఓ కు ఎండార్స్ చేసినారు.
సుజాతనగర్ మండలం గరీబ్ పేటకు చెందిన షేక్ బోలె పాషా తమకు సర్వేనెంబర్ (35 టు65/బి 64) 6.35 కుంటలు భూమి ఉందని మా తండ్రిగారైన షేక్ హుస్సేన్ పట్టాదారులుగా ఉన్నారని ఆయన మరణించారని అట్టి భూమి పాసుపుస్తకం తన పేరు మీద మార్చవలసిందిగా దరఖాస్తు చేసుకున్నారు. ఇట్టి దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్ తగు చర్యలు నిమిత్తం కలెక్టరేట్ ఓ ఎస్ ఈ ఎండార్స్ చేసినారు.
ఈ సమావేశంలో , అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.