ANDHRA PRADESHDEVOTIONAL
పరశురామ అవతారంలో శ్రీ జగన్నాథుడు

పరశురామ అవతారంలో శ్రీ జగన్నాథుడు
విశాఖ యువతరం ప్రతినిధి;
జగన్నాధ స్వామి సోమవారం పరశురామ అవతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. జగన్నాధ రథ యాత్ర ఉత్సవాలలో భాగంగా వన్ టౌన్ టర్నర్ సత్రం ఆవరణలో రోజు కొక అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఈ సందర్భంగా స్వామికి నాద స్వరం, నిత్య పూజ, లలిత సహస్ర నామార్చన, మేలుకొలుపు వంటి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ గావించారు. భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. పలు ప్రాంతాలకు చెందిన భక్తులు క్యూ లైన్లలో బారులు తీరి కనిపించారు. ఫెస్టివల్ ఆఫీసర్ శిరీష పర్యవేక్షణలో జగన్నాధ స్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి టి. రాజ గోపాల రెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఏర్పాట్లు చేశారు. ప్రధాన అర్చకుడు జగన్నా దాచార్యులు ఆధ్వర్యంలో పూజలు జరుగుతున్నాయి.