ANDHRA PRADESHWORLD

చిరుధాన్యాలతో చిత్తరువులు

విశాఖ చిత్రకారుని విశిష్ట ప్రతిభ

చిరుధాన్యాలతో చిత్తరువులు

-38 దేశాల వ్యవసాయ శాఖ మంత్రులకు ప్రధానం

విశాఖ చిత్రకారుని విశిష్ట ప్రతిభ

విశాఖ యువతరం ప్రతినిధి;

చిరుధాన్యాలతో ఆహార పదార్ధాలు చేసుకోవడం మనందరికీ తెలుసు. ఈ సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా చిరుధాన్యాలకు అంతటి ప్రాముఖ్యత లభిస్తోంది. దీనిని సాధనంగా చేసుకుని విశాఖ నగరానికి చెందిన చిత్రకారుడు మోగా విజయ్ కుమార్ తన ప్రతిభకు కొత్తదనాన్ని జోడించారు. సమాజంలో చిరుధాన్యాలపై అవగాహన కల్పించే విధంగా తన కళకు వీటిని జోడించారు. నేడు జాతీయ స్థాయిలో విజయ్ కుమార్ తీర్చిదిద్దిన చిత్రాలు ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జి 20 సదస్సులో భాగంగా 38 దేశాలకు చెందిన వ్యవసాయ శాఖ మంత్రులకు వారి చిత్రపటాలను చిరుధాన్యాలతో తీర్చిదిద్ది బహూకరించి భారతీయ కళావైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో తీసుకువెళ్లారు. కళను కేవలం ఒక మాధ్యమంగా వినియోగిస్తూ, సమాజానికి మంచి సందేశాన్ని అందిస్తున్నారు మోకా విజయ్ కుమార్ ఇప్పటి వరకు 60కి పైగా జాతీయ, అంతర్జాతీయ ప్రముఖుల చిత్రపటాలను ఆయన కేవలం చిరుధాన్యాలను ఉపయోగించి, ఎటువంటి రంగులు వాడకుండా తయారు చేయడం విశేషం. ఏపి, తెలంగాణ ముఖ్యమంత్రులతో పాటు ప్రధాని చిత్రపటాలను సైతం వీటిలో ఉన్నాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు సైతం ఆయన చిత్రపటాన్ని చిరుధాన్యాలతో తయారు చేసి విజయ్ కుమార్ బహూకరించారు.

కఠోర శ్రమ….
ఒక్కో చిత్ర తయారు చేయడానికి దాదాపు నాలుగు రోజుల వరకు సమయం పడుతుంది. ప్రధానంగా రాగులు, అరికలు, సజ్జలు, గంట్లు, సామలు వినియోగిస్తున్నారు. జర్మనీలో తయారయ్యే కాన్సన్ వాటర్ కలర్ షీట్పై ముందుగా పెన్సిల్తో అవసరమైన చిత్రానికి అవుట్లైన్ గీసుకుంటారు. అనంతరం దీనిపై ఫోటోకు అవసరమైన విధంగా చిరుధాన్యాలను ఎంతో జాగ్రత్తగా అతికిస్తూ చిత్రాన్ని తీర్చిదిద్దుతారు. అనంతరం పెస్ట్ కంట్రోల్ చేసి, గాలి చొరబడకుండా ప్రత్యేకంగా ఫ్రేమ్ కట్టించడం జరుగుతుంది.

గతంలో విశాఖ వేదికగా జరిగిన ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సైతం ప్రముఖుల చిత్రాలను చిరుధాన్యాలతో తయారు చేసి బహూకరించారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్(హైదరాబాద్) నిపుణులు ఈ చిత్రాలను పరిశీలించి, విజయ్ కుమార్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు. చిరుధాన్యాలకు ప్రాచుర్యం కల్పించే విధంగా విజయ్ కుమార్ చేస్తున్న కృషిని ప్రత్యేకంగా ప్రశంసించారు.
అమెరికా పర్యటనలో భాగంగా తృణధాన్యాలపై భారీతీయ, అమెరికన్ ఫలు గౌరవ్ షా రచించిన పాటను ప్రధాని ప్రత్యేకంగా ఆవిష్కరించారు.ఈ గీత రచనలో, కొన్ని వాక్యాలను ప్రధాని మోదీ సైతం పాడటం విశేషం. తాజాగా విజయ్ కుమార్ ఈ సదర్భాన్ని పురస్కరించుకుని ఫలు చిత్రపటాన్ని సైతం తృణధాన్యాలతో తీర్చిదిద్దారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!