సాయి సంజీవిని వాకర్స్ యోగ, ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో యోగ, నడక పై ఆరోగ్య సదస్సు

జూన్ 25న సాయి సంజీవిని వాకర్స్ యోగ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో యోగా,నడక, పై ఆరోగ్య సదస్సు
అమలాపురం యువతరం విలేఖరి;
అమలాపురం సాయి సంజీవిని వాకర్స్ యోగ ఆరోగ్య సేవా సంస్థ ఆధ్వర్యంలో రేపు ఆదివారం ఉదయం 9.30గంటలకు అమలాపురం కూచిమంచి వారి అగ్రహారంలోని సాయి సంజీవని ఆసుపత్రి ఆడిటోరియంలో యోగా,నడక, ఆరోగ్యంపై నెలవారీ ఆరోగ్య సదస్సు జరుగుతుందని వాకర్స్ యోగా ఆరోగ్య సేవా సంస్థ అధ్యక్షులు, మున్సిపల్ వైస్ చైర్మన్ రుద్రరాజు వెంకటరాజు నాని రాజు శనివారం తెలిపారు. ఆరోగ్య సదస్సులో ముఖ్య వక్తగా డాక్టర్ రుద్రరాజు సాయి శిల్ప విచ్చేసి యోగా నడక ఆరోగ్య అంశంపై ప్రసంగిస్తారని అని చెప్పారు. ముఖ్య అతిథిగా అంతర్జాతీయ వాకర్స్ ఏరియా వన్ కోఆర్డినేటర్ తేతల సత్యనారాయణ రెడ్డి విచ్చేసి ప్రసంగిస్తారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నాని రాజు మాట్లాడుతూ శరీరాన్ని మనసుని సంయోగం చేసే అద్భుత మార్గం యోగా అని ఆసనాలతో , ప్రాణా యామం తో ప్రాణశక్తిని ఉద్దీపితం చేస్తుందని దీని ద్వారా శరీరకంగా మానసికంగా మనిషి శక్తివంతుడు అవుతాడని ప్రతి ఒక్కరూ యోగా సనాలు వేయాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఉదయం గాని సాయంత్రం గాని 30 నిమిషాలు నడిస్తే అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు కలుగుతాయని నాని రాజు అన్నారు. యోగ నడక ఆరోగ్యం అంశంపై ప్రతినెలా సంస్థ తరఫున ఆరోగ్య సదస్సులు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు
సంస్థ . ఉపాధ్యక్షులు కొప్పిశెట్టి నాగేశ్వరరావు, చాట్ల లక్ష్మీనారాయణ,సర్ సివి రామన్ పబ్లిక్ స్కూల్ అధినేత రవణం వేణుగోపాలరావు, సంస్థ కార్యదర్శి ప్రముఖ కవి నల్లా నరసింహమూర్తి, కోశాధికారి బి.వి.వి సత్యనారాయణ, జాలివాకర్. కడలి సత్యనారాయణ, మాకే బాలార్జున సత్యనారాయణ, ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపాద రామకృష్ణ విశ్రాంత పి.ఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ అద్దంకి అమరేశ్వరరావు , అరిగెల బలరామమూర్తిపాల్గొంటారని ఆయన తెలిపారు.
. సభకు ఆరోగ్య సంస్థ సభ్యులు నడక, యోగ నిరంతరం చేసే వరందరూ విచ్చేసి విజయవంతం చేయాలని నానిరాజు కోరారు.