
తెలంగాణ ప్రభుత్వ తరహాలో ప్రతి రైతుకు ఎకరాకు రూ 10 వేలు రూపాయలు సాగు సాయం ఇవ్వాలి: ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం
ఎమ్మిగనూరు యువతరం ప్రతినిధి;
తెలంగాణ ప్రభుత్వం ఎకరాకు 10,000 రూపాయలు సాగు సాయం ఇస్తున్న తరహాలో మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పంపన్న గౌడ్, సిపిఐ పట్టణ కార్యదర్శి జి.రంగన్న తెలిపారు.
అనంతరం స్థానిక సిపిఐ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ దేశంలో రైతు ఆత్మహత్యలలో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉందని,వీరిలో అత్యధికులు పేద రైతులు,కౌలు రైతులు ఉన్నారని, రైతుల ఆత్మహత్యలు నివారించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా వైఫల్యం చెందాలని సందర్భంగా వారు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధరలో ఆశాస్త్రీయంగా ఉన్నాయని కనీసం మద్దతు ధరలకు కూడా రైతులతో ఉత్పత్తులను నమ్ముకోలేకపోతున్నారని కాబట్టి డాక్టర్ స్వామినాథన్ కమిషన్ సిఫారసులను ప్రభుత్వాలు అమలు చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల పండించిన పంటకు మద్దతు ధర గ్యారెంటీ చట్టం చేసేందుకు ప్రభుత్వాలు చొరవచూపాలని, మరో పక్క ప్రతి సంవత్సరం సాగు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి కానీ ప్రజలు అందరికి ఆహారం అందిస్తున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వలలో చిత్తశుద్ధి లోపించిందని ,చిన్న మరియు సన్న కారు రైతులు అత్యధికంగా రుణభారం అధికమై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఆత్మహత్యలు నివారించడానికి 2 ఎకరాల వరకు సాగు చేస్తున్న ప్రతి రైతుకు 20వేల రూపాయలు వరకు పెట్టుబడి సాయం రాష్ట్ర ప్రభుత్వాల అందించాలని వారి డిమాండ్ చేశారు. అన్ని రకాల విత్తనాలు ఎరువులు పురుగు మందులు ఉపకరణాలను 90 శాతం సబ్సిడీతో అందించి వ్యవసాయ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెంచాలని ఆలోచనను ఉపసంహరించుకోవాలని అదేవిధంగా ఉచిత విద్యుత్ కొనసాగించాలని వారి డిమాండ్ చేశారు. కేరళ తరహ రుణ ఉపశమన చట్టం తెచ్చి 50 సంవత్సరాలు పైబడిన రైతులకు కాల్ రైతులకు పదివేల రూపాయలు పెన్షన్ అందించాలని కోరుతూ దశల వారి ఉద్యమకార చర్మం ప్రకటించడం జరిగిందని వారు తెలిపారు.ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు భాస్కర్ యాదవ్,రైతు సంఘం జిల్లా సమితి సభ్యులు భేటీ చిన్నన్న, కౌలు రైతు సంఘం తాలూకా కార్యదర్శి శాంతప్ప, గోనెగండ్ల మండల కార్యదర్శి నాగప్ప, పార్టీ ప్రజా సంఘాల నాయకులు ఉరుకుందు, విజయ్, లక్ష్మన్న, తదితరులు పాల్గొన్నారు