శిథిలావస్థలో నిలిచిపోయిన అంగన్వాడి భవనం

శిధిలావస్థలో నిలిచిపోయిన అంగన్వాడిభవనం
అమడగూ రు యువతరం విలేకరి;
మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ దగ్గరలో ఉన్న
అంగన్వాడి భవనం 1 శిథిలావస్థకు చేరుకున్న పట్టించుకోని ప్రభుత్వం అధికారులు గత సంవత్సరం నుండి ఒక ఇంట్లో ఒక నెల ఇంకో ఇంట్లో రెండు నెలలు బాడిగ ఇళ్లల్లో ఉంటూ స్కూలు నడుపుతూ నాన్న అవస్థలు పడుతూ స్కూలు నడుపుతున్నారు. ఒకొ నెల ఒక ఇల్లు మారుతూ స్కూల్ పిల్లలకు చాలా ఇబ్బందిగా కరంగా మారింది పిల్లలు తల్లిదండ్రులు పిల్లలను అంగన్వాడి స్కూల్ కి పంపడానికి నిరాకరిస్తున్నారు. కొత్తగా వచ్చిన సూపర్వైజర్ ఇంతవరకు స్కూలు దగ్గరకు రావడం లేదు స్కూల్లో పడుతున్న ఇబ్బందులు పరిశీలించడం లేదు పిల్లలకు ఆడుకోవడానికి సరైన వసతి లేక అంగన్వాడి కి వచ్చే గర్భిణీలు చిన్నపిల్లలు అద్దె ఇండ్లలో ఉండటానికి స్థలము చాలక పోవడం ఇబ్బందిగా మారిందని ఇంతవరకు స్కూలు భవనం శాంక్షన్ అయిందని దానికి 14.లక్షలు గ్రాండ్ మంజూరు అయినట్లు స్కూల్ సిబ్బంది తెలిపారు. ఇంతవరకు పనులు చేపట్టడం లేదని రాజకీయ నాయకులు ఒకరి మీద ఒకరు పోటీ పడడంతో కాంట్రాక్టర్లు ఎవరు ముందుకు రావడం లేదు అని దీనివలన స్కూలు పనులు ఆగిపోయిందని తెలిపారు .దయచేసి ఇకనైనా అధికారులు స్పందించి అంగన్వాడి స్కూలు పనులు మొదలుపెట్టాలని స్కూల్ సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.