వెల్దుర్తి లో సామాజిక తనిఖీ ప్రజావేదిక
తప్పు చేస్తే చర్యలు తప్పవు, డ్వామా పిడి అమర్నాథ్ రెడ్డి

వెల్దుర్తిలో సామాజిక తనిఖీ ప్రజావేదిక
వెల్దుర్తి యువతరం విలేఖరి;
మండల కేంద్రమైన వెల్దుర్తి లోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణంలో ఎన్ఆర్ఈజీఎస్ 16 వ సామాజిక తనిఖీ ప్రజావేదిక కార్యక్రమం ప్రాజెక్టు డైరెక్టర్ అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 22 గ్రామపంచాయతీలలో గ్రామసభల అనంతరం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా పిడి అమర్నాథరెడ్డి మాట్లాడుతూ రెక్టిఫికేషన్ సొమ్ము రూ 1 లక్ష 58 వేల 871 లను వారం, పది రోజులుగా చెల్లించాలన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో రీ ప్లాంటేషన్ చేయించాలన్నారు. రీ ప్లాంటేషన్ విలువ రూ 28 లక్షల 9 వేల 704 లు అన్నారు. దాదాపు రూ 15 కోట్ల రూపాయల పని జరిగిందన్నారు. దాదాపు రూ 11 కోట్లు తో కూలీలతో పని, దాదాపు నాలుగు కోట్లతో మెటీరియల్ పని జరిగినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఉపాధి హామీ పనులలో అవకతవకలు చేసిన వారిపై చర్యలు తప్పవని తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డి సలీం భాష, విజిలెన్స్ అధికారి సిద్ధలింగమూర్తి, ఎంపీడీవో శ్రీనివాసరావు, అంబుడ్స్ మెన్ అధికారులు మధుసూదన్, చంద్రశేఖర్ రెడ్డి, ఏపీడి లక్ష్మన్న, ఏపీవో రాజు నాయక్, పి ఆర్ ఏ ఈ సురేంద్రారెడ్డి, సర్పంచ్ ముత్యాల శైలజ, జడ్పిటిసి సుంకన్న, ఎస్ఆర్పీలు, డిఆర్పీలు, ఉపాధి హామీ సిబ్బంది, టి ఏ లు, ఎఫ్ఏ లు తదితరులు పాల్గొన్నారు.