
విధి నిర్వహణలో అలసత్వం వద్దు
వెల్దుర్తి యువతరం విలేఖరి;
విధి నిర్వహణలో అలసత్వం వద్దని వెల్దుర్తి మండల ఎంఈఓ2 రమేష్ పేర్కొన్నారు.
నూతనంగా శనివారం వెల్దుర్తి మండలంకు విచ్చేసిన రమేష్ కు వెల్దుర్తి ఏపీటీఎఫ్ 1938 యూనియన్ నాయకులు మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ 2 రమేష్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఉపాధ్యాయుడు మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. ఆయా పాఠశాలలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.