లారీని ఢీకొట్టిన కారు
రంగారెడ్డిజిల్లా యువతరం ప్రతినిధి;
ఎదురుగావస్తున్నలారీని కారు ఢీకొన్న ఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పురపాలక పరిధి లోని సోలిపూర్ గ్రామ శివారులో చోటు చేసుకుంది.
ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఇన్‌స్పెక్టర్ నవీన్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై హైదరాబాద్ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది.
ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరు ఆస్పత్రి చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.