రాయలసీమ జోనల్ బైబిల్ మిషన్ డాక్టర్ బొందల రాజు చైర్మన్ గా ఏకగ్రీవం

రాయలసీమ జోనల్ బైబిల్ మిషన్ డాక్టర్ బొందల రాజుని చైర్మన్ గా ఏకగ్రీవం
డోన్ యువతరం ప్రతినిధి;
డోన్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న సమైక్య క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నందు శనివారం పత్రికా సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాస్టర్స్ ఫెలోషిప్ కార్యవర్గ సమావేశము గడిచిన 22వ తేదీ రాజమహేంద్రవరంలో డాక్టర్. ప్రతాప్ సిన్హా కొమనాపల్లి అధ్యక్షతన జరిగిన జనరల్ బాడీ మీటింగ్ లో బిషప్ డాక్టర్ డానియల్ పాల్, మేడిద జాన్సన్. కుమార్ ల సమక్షంలో రాయలసీమ జోనల్ చైర్మన్ గా బైబిల్ మిషన్ గుంటూరు ఏవో ,డాక్టర్ బందెల రాజుని స్టేట్ ఫెలోషిప్ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
ఈ సందర్భంగా జోనల్ చైర్మన్ బందెల రాజు
మాట్లాడుతూ రాయలసీమ జోనల్ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు ప్రత్యేక కృతజ్ఞతలు కమిటీ వారికి తెలిపారు.నా మీద నమ్మకము ఉంచి ఈ బాధ్యత అందించిన గౌరవ పెద్దలు బిషప్ డాక్టర్ డానియల్ పాల్ కి కృతజ్ఞుడై ఉండి నా పని స్టేట్ ఫెలోషిప్ కార్యవర్గముతో కలిసి కొనసాగిస్తానని సమైక్యంగా అన్ని జిల్లాల బిషప్లతో కలిసి పనిచేస్తానని ఏసుప్రభు సేవలో కొనసాగుతానని ప్రతిజ్ఞ చేశారు.
ఈ కార్యక్రమంలో
ఫాదర్స్ సమైక్య టీం పాల్గొన్నారు.