బస్సు యాత్రకు తరలిరండి
నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు

బస్సు యాత్రను విజయవంతం చేద్దాం
బస్సు యాత్ర వైసీపీ అధికారానికి చరమగీతం పాడే అంతిమయాత్ర కావాలి
భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ప్రకటించిన మేనిఫెస్టోను ప్రచారం చేద్దాం
వైసీపీ దుర్మార్గాలను ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలియజేద్దాం
నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-చార్జ్ డా చదలవాడ అరవింద బాబు
నరసరావుపేట యువతరం ప్రతినిధి;
నరసరావుపేట మండలం కాకాని నుండి ములకలూరు వరకు రేపు సాగబోయే బస్సు యాత్రను టీడీపీ నాయకులు,కార్యకర్తలు,వైసీపీ గూండాల బాధితులు అధిక సంఖ్యలో పాల్గొని బస్సు యాత్రను విజయవంతం చేయాలని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా చదలవాడ అరవింద బాబు ఆదివారం పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో మహానాడు వేదికగా అధినేత చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం ప్రతి కార్యకర్త,నాయకుని బాధ్యతన్నారు.వైసీపీ దుర్మార్గాలను,దుష్ట రాజకీయాలను,అవినీతి,అక్రమాలను ప్రజాక్షేత్రంలో ప్రజలకు తెలిపి వైసీపీని ప్రజా కోర్టులో దోషిగా నిరూపించాలన్నారు.టీడీపీ నిర్వహించబోయే ఈ బస్సు యాత్ర వైసీపీ అధికారానికి చరమగీతం పాడే అంతిమయాత్ర కావాలన్నారు._