పూజ్య గురువులకు సాదర స్వాగతం

పూజ్య గురువులకు సాదర స్వాగతం
కడప యువతరం ప్రతినిధి;
అనుభవజ్ఞులైన పూజ్య గురువులు ఆరోగ్యమాత పుణ్యక్షేత్రాన్ని విశ్వాస, సేవా పథంలో మరింత ముందు నడిపిస్తారని,
శాంతి సేవ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు మడగలం ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
నూతనంగా ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించిన ఫాదర్ ఎండి ప్రసాద్ రావుకు, సహాయ డైరెక్టర్ ఫాదర్ విల్సన్ కు చర్చి నందు ఆత్మీయ స్వాగతం పలుకుతూ పుష్ప గుచ్చాన్ని అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కడప జిల్లాలో సుప్రసిద్ధి గాంచిన కడప వేళాంగిణిమాత గా పేరున్న ఆరోగ్యమాత పుణ్యక్షేత్రం మరియ తల్లి దీవెనలతో దిన దిన అభివృద్ధి చెందుతుందని, తెలిపారు.
ఇంకను చిన్నపిల్లలకు సత్యుపదేశంతో కూడిన సండే క్లాసులను, యవ్వనస్తును సువార్త పరిచర్యలో పాలిభాగస్తులను చేస్తూ సేవ మార్గం వైపు నడిపించాలని, పుణ్యక్షేత్రం నందు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ సేవా రంగాలలో ముందు ఉండే విధంగా శాంతి సేవా సొసైటీ సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయని ఆయన అన్నారు.
కార్యక్రమంలో సొసైటీ కోశాధికారి ఎలిజబెత్, సభ్యులు ఆనంద్, స్రవంతి, అమృత పాల్గొన్నారు.