నాలుగు జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్
కర్నూల్ రేంజ్ డీఐజీ సెంథిల్ కుమార్

నాలుగు జిల్లాల ఎస్పీ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన… కర్నూలు రేంజ్ డిఐజి ఎస్ సెంథిల్ కుమార్ ఐపియస్ .
గ్రేవ్ కేసుల్లో తప్పనిసరిగా నిందితులకు శిక్షలు పడేలా చర్యలుండాలి.
కేసులు వీగిపోకూడదు.
రౌడీషీటర్లు, పాత నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచండి.
ఆదివారం కర్నూలు రేంజ్ డిఐజి కార్యాలయం నుండి కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల ఎస్పీలతో కర్నూలు రేంజ్ డిఐజి ఎస్. సెంథిల్ కుమార్ ఐపియస్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు.
రౌడీషీటర్స్, మాదక ద్రవ్యాలు కేసులు , పెండింగ్ ట్రయల్ కేసుల వివరాలు, నిందితుల అరెస్టు, ఛార్జిషీటు దాఖలు, కోర్టు ట్రయిల్స్ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో దిశానిర్ధేశం చేశారు .
స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రవర్తించే వారి పై పీడీ యాక్టులు, రౌడీ షీట్ ఓపెన్ చేయడం , రౌడీ షీట్ తొలగించడం వంటి వాటి గురించిన వివరాలను జిల్లాల వారీగా అడిగి తెలుసుకున్నారు.
నేరస్తులను పోలీసు కస్టడికి తీసుకున్నప్పుడు విచారణ సమయంలో తీసుకోవలసిన పలు జాగ్రత్తలను డిఐజి సూచించారు.
ఈ సంధర్బంగా కర్నూలు రేంజ్ డిఐజి మాట్లాడారు …
ఆయా జిల్లాలలోని రౌడీషీటర్స్ పై పటిష్టమైన నిఘా ఉంచాలన్నారు.
నేరాలు జరగకుండా చూడాలన్నారు.
నిందితులకు కోర్టులో శిక్షలు పడేవిధంగా చూడాలన్నారు. అలా శిక్షలు పడినప్పుడే మార్పు వస్తుందన్నారు.
జైలు నుండి బెయిల్ పై విడుదలయ్యే నిందితుల కదలికల పై నిఘా ఉంచాలన్నారు.
స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారాన్ని సేకరిస్తుండాలన్నారు.
పోలీసు అధికారులు కోర్టు మెజిస్ట్రేట్ ను ప్రతి శనివారం కలిసి కేసుల స్ధితి గతి గురించి మాట్లాడి ట్రయల్స్ త్వరగా వచ్చే విధంగాను, శిక్ష పడేవిధంగా చూడాలన్నారు.
బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ , విద్యాసంస్ధలు తదితర ప్రాంతాలలో తనిఖీలు నిర్వహించాలన్నారు. గంజాయి విక్రయిస్తున్న నిందితులను గుర్తించి గట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
ఎక్కడి నుండి అక్రమ రవాణా జరుగుతుందో ఆ మూలాలను గుర్తించి అరికట్టాలన్నారు.
మత్తు పదార్దాల అక్రమ రవాణా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్సులో కర్నూలు జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఐపియస్ ,నంద్యాల జిల్లా ఎస్పీ. కె.రఘువీర్ రెడ్డి ఐపియస్ , కడప జిల్లా ఎస్పీ కే.కే.ఎన్.అన్బురాజన్ ఐపియస్ , అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర రావు ఐపిఎస్ , డిఎస్పీ లు, సిఐలు పాల్గొన్నారు.