
జగనన్న సురక్షిత పథకం పేదప్రజలకు రక్షణ కవచం
ఈఓఆర్డి నసీమా
అమడగురు యువతరం విలేఖరి;
జగనన్న సురక్షిత పథకం పేద ప్రజలకు రక్షణ కవచం లాంటిదని ఈ ఓ ఆర్ డి నసీమ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఆమడగూరు లోని పలు కాలనీలలో జగనన్న సురక్షత కార్యక్రమంలో భాగంగా ఈ ఓ ఆర్ డి ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందితోపాటు, వాలంటర్లు తో కలిసి ఇంటింటా ప్రభుత్వ సంక్షేమ పథకాలపై వివరిస్తూ అర్హత ఉండి సంక్షేమ పథకాలు దక్కని లబ్ధిదారులను గుర్తించారు. ఈ సందర్భంగా ఈ ఓ ఆర్ డి నసీమ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద ప్రజల సంక్షేమం కోసం ఓ విన్నుత కార్యక్రమం నికి శ్రీకారం చుట్టిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హత ఉండి లబ్ధి పొందని లబ్ధిదారులను గుర్తించి వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించేందుకే జగనన్న స్వచ్ఛత కార్యక్రమం ప్రవేశపెట్టిందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఇంటి ముంగిటికే ప్రభుత్వ అన్ని శాఖల అధికారులు ఇంటి దగ్గరికి వచ్చి వారి సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమం మండలంలో అన్ని గ్రామాలలోనూ, అన్ని గడపలకు తొక్కి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతి కార్యదర్శి చంద్ర, డిజిటల్ అసిస్టెంట్ అశోక్, సచివాల సిబ్బంది, వాలంటర్లు, గృహసారతులు, తదితరులు పాల్గొన్నారు