ANDHRA PRADESHPOLITICS

గంప సవాల్ కు నేను ఎప్పుడైనా సిద్ధమే

మాజీ మంత్రి షబ్బీర్ అలీ

గంప సవాల్ కు నేను ఎప్పుడైనా సిద్ధమే

బిజెపి, టిఆర్ఎస్ ఒక్కటే..

ఢిల్లీలో బిజెపి, టిఆర్ఎస్ దోస్తీ గల్లీలో కుస్తీ..

బిజెపి, టిఆర్ఎస్ పై విరక్తితో కాంగ్రెస్ లోకి భారీ వలసలు….

కామారెడ్డి యువతరం ప్రతినిధి;

మాజీ మంత్రి షబ్బీర్ అలీ కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ
గంప గోవర్ధన్ సవాలకు నేను ఎప్పుడైనా సిద్ధమే నీకు దమ్ముంటే సమయం చెప్పు సింగిల్ గా వస్తా అన్నారు.
ఇల్లు కట్టే మేస్త్రీలను నీవు కించపరిచావు మొదట వారికి క్షమాపణ చెప్పు
ఈ ఛాలెంజ్ లు రాజకీయ మైలేజ్ కోసం కాదు నాసిరకం నిర్మాణాలు చేసి ఇప్పుడు దానికి మెరుగులు దిద్ది ప్రజల ప్రాణాలతో చెలగాటమాడకు అని హితవు పలికారు.
ఎక్కడైనా బెస్ మీట్ కట్టి బిల్డింగ్ కడతారు, ఇక్కడ బిల్డింగ్ కట్టి బేస్మెంట్ కడుతున్నారు అని ఆరోపించారు.
నీవు ఒక మాట మీద నిలబడే వాడివైతే రా నేను ఎప్పుడైనా సిద్ధమే ఇంజనీర్లను తీసుకొనిరా ఇంకా ఎవరినైనా తీసుకురా నిర్మాణంలో లోపాలు ఉన్నాయి ఈ ఛాలెంజ్ కు నేను సిద్ధమే అని సవాల్ విసిరారు.
పిరికిపందల వెనుకకు పోయి పేద ప్రజల ప్రాణాలు తీసుకోకు
డబల్ బెడ్ రూమ్ లు కూలి ఎవరైనా చస్తే దానికి నీవు కేసీఆర్ మాత్రమే బాధ్యులు అవుతారన్నారు. మీపై నే కేసులు పెడతాను అని తెలిపారు.
బిజెపి, బిఆర్ఎస్ పార్టీల అక్రమ బంధం బట్టబయలైంది ఇద్దరు ఒక్కటేనని తేలిపోయింది అన్నారు.
డిప్యూటీ సీఎం మంత్రులు జైల్లో కెసిఆర్ కూతురు కవిత సంబరాల్లో
కేటీఆర్ రహస్య ఢిల్లీ పర్యటనే ఇందుకు నిదర్శనం అని తెలిపారు.
కెటిఆర్ సెంట్రల్ మంత్రులతో రహాస్య సమావేశాలు నిర్వహించడంలో మతలబు ఎంటీ అని ప్రశ్నించారు.
రాష్ట్రానికి వచ్చిన ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులను కేసీఆర్, కేటీఆర్ ఏనాడైనా కలిసారా అని నిలదీశారు.
అభివృద్ధి నిధులు ఇవ్వాలని ఏరోజైన మెమోరాండం ఇచ్చారా అన్నారు.
నేడు అభివృద్ధి నిధుల కోసమే మంత్రులను కలుస్తున్నామని చెప్తున్నారన్నారు.
బిజెపి, బిఆర్ఎస్ పార్టీలు చీకటి ఒప్పందం చేసుకున్నాయన్నారు.
కవిత అరెస్ట్ తప్పించడానికే కేటీఆర్ పర్యటన అన్నారు.
కేటీఆర్ ఢిల్లీ పర్యటనపై బండి సంజయ్ మాట్లాడటం హాస్యాస్పదం
కవిత అరెస్టుపై కేంద్రంలో, రాష్ట్రంలో బీజేపీ బిన్నవాదనలు వినిపిస్తున్నాయన్నారు.
అందుకే పార్టీ సిద్ధాంతాలు నచ్చక ముఖ్య నాయకులే మాటల తూటాలు పేలుస్తున్నారన్నారు.
బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరడానికి చాలా మంది వస్తున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్, చంద్రకాంత్ రెడ్డి, పాక జ్ఞానేశ్వరి, పుట్నాల శ్రీను,నౌసిలాల్, కరంగుల అశోక్ రెడ్డి, లింగారెడ్డి, సుధాకర్ రెడ్డి, భూమాగౌడ్, శివ కృష్ణమూర్తి, గూడెం శ్రీను, భీంరెడ్డి, సుతారి రమేష్, యాదవ రెడ్డి, పండ్ల రాజు,నర్సాగౌడ్,బ్రహ్మానందరెడ్డి ,సందీప్ , గుడుగుల శ్రీను, తిరుమలస్వామి, కడెం ప్రవీణ్. శ్రీనివాస్ రెడ్డి,రాజగౌడ్, చంద్రగౌడ్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.­

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!