ఇందిరా నగర్ లో నాలుగు సార్లు అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు
నేటికీ అవే ప్రాంతంలో మళ్లీ నిర్మాణాలు

ఇందిరానగర్ లో నాలుగు సార్లు అక్రమ నిర్మాణాలను తొలగించిన అధికారులు.
నేటికి అవే ప్రాంతంలో మళ్ళీ నిర్మాణాలు.
అక్రమ నిర్మాణాలను పూర్తిస్థాయిలో పరిశీలిస్తామన్న కమిషనర్
కడప యువతరం ప్రతినిధి;
సుమారు పది సంవత్సరాల నుండి డజన్ల కొద్ది భూ కబ్జాదారులు ప్రభుత్వ స్థలాలపై డేగ కన్ను వేసి ఆక్రమించి పునాదులు వేయడం, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ పోరాటంతో ప్రభుత్వ స్థలాలను ఎప్పటికప్పుడు అధికారుల సహకారంతో ప్రజా అవసరాల కోసం కాపాడుతూ పునాదులను జెసిపిలతో తొలగించడం ధారావాహికంగా జరుగుతున్నదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు మడగలం ప్రసాద్ అన్నారు.
శనివారం మున్సిపల్ కమిషనర్ సూర్య సాయి ప్రవీణ్ చందు ని తన ఛాంబర్ నందు కలసి భూ కబ్జాలపై వినతి పత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,
చింతకొమ్మదిన్నె, మామిళ్ళపల్లి, ఇందిరానగర్ లే అవుట్ లోని సర్వే నెంబర్ 731, 732, 733. నెంబర్లలో డజన్ల కొద్ది భూ కబ్జా దారులు పోటీలు పడి ఒకే స్థలంపై అనేకమంది తప్పుడు పత్రాలతో పునాదులు వేస్తున్నారని వేసిన వన్ని తప్పుడు పత్రాలు కావడంతో ఒకటి కూడా నిలబడిన సందర్భాలు లేవని గతంలో ఇదే స్థలంపై అనేకసార్లు పునాదులు తొలగించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
5000 పైగా ఉన్న కుటుంబాలకు కనీస మౌలిక సదుపాయాల కల్పన కోసం కార్పోరేషన్ వారు కొంత iస్థలాన్ని వివిధ అవసరాల కోసం ఉంచితే ప్రజా అవసరాలు దేవుడెరుగు ఉన్న స్థలాన్ని అక్రమ పద్ధతులలో ఆక్రమించేసి కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతు, ప్రజలు వివిధ అవసరాల కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతాలను వెళ్లాల్సిన దుర్భర రోజులు వస్తాయని ఆయన తెలిపారు.
స్పందించిన కమిషనర్ దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలించి అక్రమాలపై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కార్యక్రమంలో స్థానికులు, ఆర్ సి పి పార్టీ నాయకులు పాల్గొన్నారు.