ఆరోగ్య మాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ గా ఫాదర్ ఎండి ప్రసాదరావు

ఆరోగ్యమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ గా ఫాదర్ ఎండి ప్రసాదరావు
కడప యువతరం ప్రతినిధి;
ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి నూతన డైరెక్టర్ గా ఫాదర్ ఎండి ప్రసాదరావు నియమితులయ్యారు.
దేవుడు ఆజ్ఞాపించిన స్థలానికి వెళ్లి సువార్త చేయడమే నా కర్తవ్యం అని ఆరోగ్య మాత నూతన డైరెక్టర్ ఫాదర్ ఎండి ప్రసాదరావు అన్నారు.
ఆరోగ్యమత మరియ తల్లి విశ్వాసులను మరింత ఆధ్యాత్మిక పదంలో ముందుకు నడిపించుటకు, ఆరోగ్యమాత చర్చిని మరికొంత అభివృద్ధి పరచుటకు కడప అపోస్తులిక పాలనాధికారి కతోలిక పీఠాధిపతులు బిషప్ గాలి బాలి ఆదేశాల మేరకు నన్ను ఈ ప్రాంతానికి నియమించారని,
ఇందులో అందరిని సమానత్వంతో ఆధ్యాత్మిక అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తానని అన్నారు.
నేను గత 32 సంవత్సరాలుగా గురుత్వ జీవితంలో ఉంటూ రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో దేవుని యొక్క సువార్త వ్యాప్తి చేస్తూ దేవుడు నిర్దేశించిన ప్రాంతానికి వచ్చానని
గతంలో పనిచేసిన సదుం ఆశ్రమం కంటే
మిన్నగా ఆరోగ్యమాతలో మరియ తల్లి సేవలు విస్తృతంగా చేస్తానని దీనికి కమిటీ పెద్దలు అమ్మగార్లు కతోలిక విశ్వాసులు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని ఆయన తెలిపారు.
రేపు నెలలో జరిగే అరులయ్య వర్ధంతిని మేత్రసన స్థాయిలో ఇప్పుడు ఆయనను అందరికీ తెలిసేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.