మనీత్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో పేద పిల్లలకు ఉచిత నోటు పుస్తకాల పంపిణీ

మనీత్ ఏజెన్సీస్ ఆధ్వర్యంలో పేద పిల్లలకి నో టు పుస్తకాల పంపిణీ
అమడ గురు యువతరం విలేకరి;
మండల పరిధిలోని గోపాల్ నాయక్ తండా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల పేద విద్యార్థులకు మనీత్ ఏజెన్సీస్ నాగార్జున నాయుడు కదిరి మరియు స్థానిక ఉపాధ్యాయుడు గోపాల్ రెడ్డి ల ఆర్థిక సహాయంతో విద్యార్థులకు శుక్రవారం నోటు పుస్తకాలు, లైబ్రరీ బుక్స్ ,పెన్నులు ,పెన్సిల్లు , రైటింగ్ ప్యాడ్స్, డ్రాయింగ్ బుక్స్ తదితర విద్యా సామాగ్రిని ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా నాగార్జున నాయుడు ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ తనను ఈ స్థాయిలో ఉంచిన విద్య యొక్క రుణాన్ని కొంతవరకైనా తీర్చుకోవాలని ఉద్దేశంతో పేదరికంతో ఎవరికీ చదువు దూరం కాకూడదని అజ్ఞాన అంధకారాన్ని తొలగించే ఏకైక మార్గం చదివేనని వారు తెలియజేశారు. ఉపాధ్యాయులు గోపాల్ రెడ్డి ఎంత ఔదార్యంతో ప్రతి సంవత్సరం బడి బాట సమయంలో నోటు పుస్తకాలు మరియు విద్యా సంవత్సరం సరిపడా విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు కల్పించడంపై పలువురు గ్రామస్తులు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.