వెల్దుర్తి సిహెచ్ సీ ని తనిఖీ చేసిన నోడల్ అధికారి

సిహెచ్ సి ని తనిఖీ చేసిన నోడల్ అధికారి
వెల్దుర్తి యువతరం విలేఖరి;
మండల కేంద్రమైన వెలుతులోని సిహెచ్సి ని జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి మరియు నోడల్ అధికారి డాక్టర్ ప్రవీణ్ శుక్రవారం తనిఖీ చేసి టీకాలు నిల్వ ఉండే శీతలీకరణ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్యశాలలో కాన్పు అయిన చిన్నపిల్లలకు జీరో డోర్స్ టీకాలు తప్పక వేయాలని ఆదేశించారు. అనంతరం సిహెచ్ సి నందలి స్కానింగ్ సెంటర్ ను తనిఖీ చేసి రికార్డ్స్ మరియు రిపోర్ట్స్ ను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగింది. లింగ వివక్షత నిర్మూలన, గర్భస్థ లింగ నిర్ధారణ వ్యతిరేక చట్టం మరియు ఆడపిల్లల ప్రాముఖ్యతపై అవగాహనలో భాగంగా వారు మాట్లాడుతూ లింగ నిర్ధారణ పరీక్షలు చట్ట ప్రకారం నేరమన్నారు. దీన్ని అరికట్టాలని ఉద్దేశంతో ప్రభుత్వం ఒక చట్టాన్ని అమలులోనికి తెచ్చిందని అదే గర్భస్థ పిండ పరీక్ష ప్రక్రియ నియంత్రణ మరియు దుర్వినియోగ నివారణ చట్టం 1994 అని వివరించారు. అంతేకాకుండా సమాజంలో స్త్రీ, పురుషులు ఇరువురు సమానమే అన్నారు. స్త్రీ పురుషుల మధ్య ఏ వివక్ష ఉండకూడదు నిజానికి పురుషుడు కంటే స్త్రీ ఏ విషయంలోనూ తక్కువ కాదు అందుకే ఈనాడు అన్ని రంగాలలోనూ స్త్రీలు పురుషులతో సమానంగా రాణిస్తున్నారని తెలిపారు. ప్రజలకు ఆరోగ్య సిబ్బంది ఈ విషయాలపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ప్రతిభా గ్లోరీ, డాక్టర్ రంగస్వామి, ప్రోగ్రాం కన్సల్టెంట్ సుమలత, వైద్య ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.