ANDHRA PRADESHBREAKING NEWS

బక్రీద్ పండుగ సజావుగా జరుపుకోవాలి

డోన్ డి.ఎస్.పి శ్రీనివాసరెడ్డి

బక్రీద్ పండగ సజావుగా జరుపుకోవాలి

డోన్ డి.ఎస్.పి శ్రీనివాస రెడ్డి

డోన్ యువతరం ప్రతినిధి

బక్రీద్ పండగను సామరస్యంగా జరుపుకోవాలని డోన్ డి.ఎస్.పి శ్రీనివాస్ రెడ్డి ముస్లిం పెద్దలకు సూచించారు .ఆర్ అండ్ బి అతిథి గృహం నందు పీస్ సమావేశాన్ని సర్వ మతాల పెద్దలతో నిర్వహించిన ఆయన ప్రతి ముస్లిం సోదరుడు బక్రీద్ పండగ రోజున కుర్బానీ కార్యక్రమం చేపట్టే వారు ఇతరుల ఆహారపు అలవాట్లను తెలుసుకొని కుర్బానీ ఇవ్వాలన్నారు.
బిజెపి నాయకులు మహారాజ్ ,హేమ సుందర్ రెడ్డిలు గోవధకు తాము వ్యతిరేకమని గోవును పూజించే సంస్కృతి భారతదేశంలో ఉన్నందున ముస్లిం సోదరులు ఏ ఒక్కరి మనోభావాలు దెబ్బ తినకుండా పొట్టేలు తదితర మాంసకృతులను మాత్రమే కుర్బానీ నందు వాడాలని తద్వారా స్నేహభావంతో అందరూ మెలుగుతారన్నారు. ఏవేని చిన్న సమస్యలు తలెత్తినా ఎవరికి వారు దూషణలకు దిగి చట్టాన్ని చేతిలోకి తీసుకోకుండా తమకు సమస్యను తెలిపితే పరిష్కారం చూపుతామని లేనిపక్షంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డిఎస్పి శ్రీనివాసరెడ్డి ,పట్టణ సిఐ శేషయ్య తెలిపారు. సహాయ సహకారాలు బక్రీద్ పండగ సజావుగా గతంలో మాదిరి ప్రస్తుతం కూడా తమ వంతు సహాయ సహకారాలు బక్రీద్ పండగ సజావుగా జరిగేందుకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని మున్సిపల్ చైర్మన్ సప్తశైల రాజేష్ ,డోన్ మండలాధ్యక్షుడు రేగటి రాజశేఖర్ రెడ్డి ముస్లిం  లకు హామీ ఇచ్చారు .

 

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!