ANDHRA PRADESH
ఘనంగా అక్కదేవతల పరుష

ఘనంగా అక్కదేవతల పరుష
అమడ గురు యువతరం విలేకరి;
మండల పరిధిలోని ఎ.రెడ్డివారిపల్లి గ్రామంలో ఎరికే నరసింహులు,కవిత,రంజిత్ కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో అక్కదేవతల పరుష కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఎ.రెడ్డివారిపల్లి గ్రామం నుండి గ్రామ సమీపంలోని అక్కదేవతల గుడి వరకు ఎలవ గంపలలో పూజా సామాగ్రిని తీసుకెళ్లి అక్కదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం ఏడుగురు బాలికలను అక్కదేవతలు గావించి వారికి పసుపు,కుంకుమలతో ప్రత్యేక పూజలు చేశారు.కర్ణాటక ,ఆంధ్ర చుట్టుప్రక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూజలు నిర్వహించి కోర్కెలను కోరుకున్నారు.అనంతరం భక్తులకు అన్నదానం ,తీర్థ ప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు .