సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ పై దాడి
జిల్లా ఎస్పీకి వినపత్రం అందించిన పుట్టపర్తి పాత్రికేయులు

సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ పై జరిగిన దాడిని ఖండిస్తూ జిల్లా ఎస్పీకు వినతిపత్రం అందించిన పుట్టపర్తి పాత్రికేయులు
పుట్టపర్తి యువతరం ప్రతినిధి;
పత్రికలలో వాస్తవ విషయాలను ప్రచురిస్తే వాటిని జీర్ణించుకోలేని కొందరు నాయకులు జర్నలిస్టులపై దాడులు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని శ్రీసత్యసాయి జిల్లా కేంద్రంలోని పాత్రికేయులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా గోరంట్ల మండలానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఈశ్వర్ పై దాడి చేసిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ జిల్లా ఎస్పీ మాధవ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.
అంతేకాక ఈశ్వర్ పై అక్రమంగా ఎస్సీ అట్రాసిటీ కేసు బనాయించడం సమంజసం కాదని ఆ కేసును వెంటనే తొలగించాలని ఎస్పి కు విన్నవించారు.
అలాగే దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలిపారు.
అనంతరం జిల్లాలోని జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు పోలీస్ శాఖ తరపున చట్టపరమైన చర్యలను ముందస్తుగా అమలుపరచాలని ఎస్పీ మాధవరెడ్డినీ కోరారు.
జర్నలిస్టులపై దాడులను అరికట్టలేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ఉదృతం చేస్తామని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు టిసి.గంగాధర్ , గోరంట్ల మహేష్ , షేక్షావలి , అంజలి , గూడ శ్రీనివాసులు ,విజయరంగా , చంద్ర , లింగమయ్య , అంజి , తదితరులు పాల్గొన్నారు.