
మైసూర్ లో జరగనున్న తెలుగు- కన్నడకవి సమ్మేళనం బ్రోచర్ ఆవిష్కరణ
అమలాపురం యువతరం విలేఖరి;
అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక జాతీయ చైర్మన్ అక్షర తపస్సు డాక్టర్ కత్తి మండ ప్రతాప్ నిర్వహణలో జూన్ 25వ తేదీ ఆదివారం కర్ణాటక రాష్ట్రం మైసూర్ లోతెలుగు -కన్నడ జాతీయ శతాధిక కవి సమ్మేళనం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం అమలాపురంలో శ్రీ శ్రీ కళావేదిక డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ, కోనసీమ రచయితల సంఘం ఆధ్వర్యంలో బ్రోచర్లను అంతర్జాతీయ వాకర్స్ ఏరియా వన్ కోఆర్డినేటర్ తేతలసత్యనారాయణ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ చేస్తున్న సాహితీ సేవలను కొనియాడారు. జిల్లా శ్రీ శ్రీ కళావేదిక కన్వీనర్ , కోనసీమ రచయితల సంఘం అధ్యక్షులు బి వి వి సత్యనారాయణ సభకు అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ జూన్ 25వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కవి సమ్మేళనంజరుగుతుందని ఆయన చెప్పారు. శ్రీ శ్రీ కళావేదిక జిల్లా అధ్యక్షుడు ప్రముఖ సాహితీవేత్త నల్లా నరసింహమూర్తి మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో తెలుగు కన్నడ భాషల ఉభయ కవి సమ్మేళనం జరగడం ఇదే ప్రథమవని ఆయన అన్నారు. ఉభయ భాషల్లో కవి సమ్మేళనం నిర్వహించడం డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సాహితీ సేవలకు నిదర్శనమనికవులు అభినందనలు తెలుపుతున్నారని ఆయన అన్నారు. ప్రొఫెసర్ డాక్టర్ శ్రీపాద రామకృష్ణ, కడలి సత్యనారాయణ ప్రసంగించారు. మైసూర్ లో జరిగే కార్యక్రమంలో శ్రీ శ్రీ కళా వేదిక జాతీయ కన్వీనర్ శ్రీమతి కొల్లి రమావతి, జాతీయ ప్రధాన కార్యవర్గం చిట్టేలలిత, గుత్తా హరి సర్వోత్తమరావు రాష్ట్ర గౌరవ అధ్యక్షులు టి.జి.ఎస్ అవినాష్, రాష్ట్ర మహిళా అధ్యక్షులుప్రభా శాస్త్రి మొదలైన వారుపాల్గొంటారు.