ANDHRA PRADESHHEALTH NEWS
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి
అమడగూ రు యువతరం విలేకరి;
పరిసరాలను పరిశుభ్రంగా వుంచుకోవాలని వైద్యాధికారులు మోనా,అపర్ణ పేర్కొన్నారు.శుక్రవారం ప్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు.మండలంలోని అన్ని గ్రామాలలో వైద్య అధికారులు సిబ్బంది పర్యటించి మురికినీటి కాలువలు పైన,వర్షపు నీటి గుంతలు పైన వేస్ట్ ఆయిల్ ,బ్లీచింగ్ పౌడర్ చల్లారు.అదేవిధంగా పరిసరాలు పరిశుభ్రత పైన ప్రజలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.అలాగే ప్రతిరోజూ దోమల నివారణకు సాయంత్రం పూట వేపకు పొగ వేసుకోవాలన్నారు.ఇలా చేయడం వలన ఆనారోగ్యల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చునన్నారు.ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.