నారా లోకేష్ ను కలిసిన మాచవరం రైతులు

నారా లోకేష్ ను కలిసిన మాచవరం రైతులు
సూళ్లూరుపేట యువతరం ప్రతినిధి;
• సూళ్లూరుపేట నియోజకవర్గం మాచవరం రైతులు యువనేత లోకేష్ ను కలిసి శనివారం వినతిపత్రం సమర్పించారు.
• మా గ్రామ పరిధిలోని మేత పోరంబోకు సర్వే నెం.207లో 263 ఎకరాల భూమి, సర్వేనెం. 226లో 136.7 ఎకరాల భూమి ఉంది.
• వైసిపి ప్రభుత్వం వచ్చాక కొందరు ఈ భూమిపై కన్నేశారు.
• ఎమ్మెల్యే నేతృత్వంలో గ్రామసర్పంచ్ భర్త, మరికొందరు అధికారపార్టీ నాయకులు ప్రీమియర్ ఎక్స్ ప్లోజివ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీతో కుమ్మక్కయి, వారిపేరిట కారుచౌకగా బదలాయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
• పంచాయితీలో తీర్మానం చేయకుండా రాత్రికి రాత్రే ఓజిలి ఎమ్మార్వో వద్ద పత్రాలు సిద్ధం చేసి కలెక్టర్ కు పంపించారు.
• ఈభూమిలో 51మంది దళితులకు ఏక్ సాల్ పట్టాలు, 18మందికి డికెటి పట్టాలు ఉన్నాయి.
• ఈ భూముల గుండానే తెలుగుగంగ కాల్వ ప్రవహిస్తోంది.
• చుట్టుపక్కల 14 గ్రామాల రైతులు పశుగ్రాసానికి ఈ భూమిపైనే ఆధారడి ఉన్నారు.
• ఇందులోనే ఒక భారీ గ్రావెల్ కొండ ఉంది. దానిపై కూడా అధికారపార్టీ నేతలు కన్నేశారు.
• ఈ భూములను అన్యాక్రాంతం చేసే ప్రయత్నాలపై మేము ఎమ్మార్వోను ప్రశ్నించగా, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైసిపి నేతలు మమ్మల్ని బెదిరించారు.
• దీనిపై మేము హైకోర్టును ఆశ్రయించగా, ప్రభుత్వం ఇప్పటివరకు కౌంటర్ దాఖలుచేయలేదు.
• కేసు వాపసు తీసుకోవాలని మమ్మల్ని ఫోన్లు చేసి రకరకాలుగా బెదిరింపులకు దిగుతున్నారు.
• ప్రస్తుతం ఎమ్మెల్యే సదరు కంపెనీ వారితో కుమ్మక్కయి తిరుపతి జిల్లా కలెక్టర్ పై తీవ్ర వత్తిడి తెస్తున్నారు.
• ఈ భూమిపైనే ఆధారపడి జీవిస్తున్న 14 గ్రామాల రైతులు, దళితులకు మీరు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• రాష్ట్రంలో గత నాలుగేళ్లుగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందనడానికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాలి?
• 14 గ్రామాల రైతులు, దళితులకు ఆధారంగా ఉన్న పోరంబోకు భూమిని కాపాడాల్సిన ఎమ్మెల్యేనే భూమిని ధారాదత్తం చేయాలని చూడటం దారుణం.
• మాచవరం భూముల వ్యవహారంపై జిల్లాకలెక్టర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖరాస్తాం.
• ఈ విషయమై అవసరమైతే అసెంబ్లీ, కౌన్సిల్ లో ప్రస్తావించి ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
• ప్రజలంతా ఐకమత్యంగా ఉండి తిరగబడితే వైసిపి దొంగలు పారిపోవడం ఖాయం.
• వందలాది రైతులు, దళితులు చేస్తున్న న్యాయపోరాటానికి అండగా నిలుస్తాం.