ANDHRA PRADESHPOLITICS
నారా లోకేష్ ను కలిసిన తిరుమలపూడి ఎస్టీ కాలనీవాసులు

నారా లోకేష్ ను కలిసిన తిరుమలపూడి ఎస్టీ కాలనీవాసులు
సూళ్లూరుపేట యువతరం ప్రతినిధి;
సూళ్లూరుపేట నియోజకవర్గం తిరుమలపూడి ఎస్టీ కాలనీవాసులు లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలపై శనివారం వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మా గ్రామంలో మాకు తాగునీటి సమస్య అత్యధికంగా ఉంది అన్నారు.
మాలో చాలామందికి ఇళ్లు లేవు, ఇళ్లు నిర్మించి ఇవ్వాలి అని పేర్కొన్నారు.
మేము సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇప్పించాలి అని కోరారు.
- నారా లోకేష్ స్పందిస్తూ
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్సీ,ఎస్టీ, బిసి, మైనారిటీలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని తెలిపారు.
ఎస్టీలకు చెందిన రూ.5355 కోట్ల నిధులను జగన్ ప్రభుత్వం దారిమళ్లించి తీరిన ద్రోహం చేసింది అని తెలిపారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే తిరుమలపూడిలో ఇంటింటికీ తాగునీటి కుళాయి అందజేస్తాం అన్నారు.
తిరుమలపూడి ఎస్టీకాలనీలో ఇళ్లులేని వారికి పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తాం అన్నారు.
అటవీ చట్టాలకు లోబడి గిరిజనులు సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం అని హామీ ఇచ్చారు.