మానవత్వం చాటుకున్న దాతలు

మానవత్వం చాటుకున్న దాతలు
వెల్దుర్తి యువతరం విలేఖరి;
మండలంలోని రామళ్లకోట గ్రామానికి చెందిన 95 సంవత్సరాల నిరుపేద వృద్ధుడు దుగ్గి శాంతయ్య తన పింఛన్‌ను కోల్పోయిన సంగతి, 20 నెలలుగా అనారోగ్యంతో అల్లాడుతున్న పరిస్థితి అందరికీ తెలుసిందే.నెలన్నర క్రిందట విధి వక్రించి దుగ్గి శాంతయ్య కాలుజారి కిందపడి ఆయన ఎడమ కాలు తుంటి ఎముక విరిగిపోయి దారుణమైన పరిస్థితులలో ఆయన కాలుకు సర్జరీకి జరిగింది.రాడ్ వేయడం జరిగింది. ఈ విషాదంతో ఆర్థిక ఇబ్బందులతో అల్లాడుతున్న దుగ్గి శాంతయ్య బేతంచర్లలో ఆయన కుమారుడు ఇంట్లో వున్నారు . గురువారం ఆయనను కలుసుకొని కొంత నగదును ఆర్థిక సాయం అందించడం జరిగింది. విషయం తెలుసుకున్న అల్లు గుండు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల హిందిపండిట్ స్వయంప్రభ తన వంతు ఆర్థిక సహాయం అందించారు.. ఈ కార్యక్రమంలో హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు హరి సింహ నాయుడు మరియు రామళ్లకోట సీనియర్ సిటిజన్ నాగప్ప ఆయనను పరామర్శించి ఆయనకు ధైర్యం చెప్పడం జరిగింది. దుగ్గి శాంతయ్య కు సహాయం చేయాలని సేవా దృక్పథం ఉన్న వారిని మరియు అధికారులను, నాయకులను ముఖ్యంగా మండల ప్రజలను వారు వేడుకోవడం జరిగింది..