ANDHRA PRADESH

పున్నయ్య స్వామిని ఆశ్రమ బహిష్కరణ చేయాలి

పున్నయ్య స్వామిని ఆశ్రమ బహిష్కరణ చేయాలి

– వెంకోజీ పాలెం ప్రజల డిమాండ్

విశాఖ యువతరం ప్రతినిధి;

బాలిక పై లైంగిక దాడి కేసులో రిమాండ్ కి వెళ్ళిన పున్నయ్య స్వామిని ఆశ్రమం నుంచి తక్షణమే బహిష్కరించాలని కొత్త వెంకోజీ పాలెం గ్రామ సేవా సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు సంఘం కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడారు. 80 ఏళ్ల చరిత్ర కలిగిన జ్ఞానానంద ఆశ్రమం ప్రతిష్ట దెబ్బ తినేలా వ్యవరించడం దురదృష్ట కరం అన్నారు. ఇతను 2012 లో కూడా ఇలాంటి కేసులో నిందితుడు గా వున్నాడని గుర్తు చేశారు. గతంలో ఇక్కడ భగవద్ గీత పారాయణం లో తమ గ్రామం ప్రజలు పాల్గొనే వారు అన్నారు. ఇద్దరు దాతలు ఆరు ఎకరాల భూమి దానం గా ఇచ్చిన ఈ స్థలంలో ఆశ్రమం, మూడు దేవాలయాలు నిర్మించామని అన్నారు. కానీ, దాతల సాయం తో పిల్లల ఆశ్రమం, గోశాల నిర్వహిస్తున్న స్వామీ తమ గ్రామస్థులతో గొడవలు పడి కేసులు వేస్తూ వేధిస్తున్నాడు అని ఆందోళన వ్యక్తం చేశారు. దాతలు లో ఒకరైన పీలా అప్పారావు కుమారులు భూములు వెనక్కి ఇవ్వాలని ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో స్వామి వీరికి అమ్మేసిన స్థలంలో చెక్కల దుకాణాలకు అద్దె లకు ఇచ్చారని అన్నారు. అలాగే స్మశానం పక్కన స్థలాలు ఆక్రమించి, ఎంవీవీ, పీలా హోమ్స్ అపార్ట్మెంట్లు నిర్మించారు అన్నారు. తాము వినియోగించే స్మశానంలో ఎలాంటి అభివృద్ధి పనులు చెయ్యనీయడం లేదు అని మండి పడ్డారు. ఆశ్రమం పేరుతో అకృత్యాలకు పాల్పడుతున్న స్వామిని కటినంగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. అలాగే, స్వామి అడ్డు తొలగి పోతే భూములు ఆక్రమించడం సులభం అని ఏపీ సాధు పరిషత్ నాయకులు అంటున్నారని తమ గ్రామస్థులు వుండగా ఆక్రమణలు ఏవి జరగవు అని స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో గ్రామ సేవా సంఘం అధ్యక్షుడు మద్దాల వీర వెంకట అప్పారావు, మాజీ అధ్యక్షులు కాళ్ల బాబురావు, కాళ్ల వరహాలు, దాడి పరదేశి రావు మాట్లాడారు. సమావేశంలో సంఘం నాయకులు పాల్గొన్నారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!