POLITICS

నంద్యాల జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై విస్తృత దాడులు, పలు కేసులు నమోదు

నంద్యాల జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై విస్తృత దాడులు పలు కేసులు నమోదు……

నంద్యాల జిల్లాలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై జిల్లాలో ఒక్క మే నెలలో 20 కేసులో నమోదు…..

రేషన్ బియ్యం తరలిస్తున్న 54 మంది ముద్దాయిలు అరెస్ట్…..

అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న 14 వాహనాలు సీజ్……

సుమారు 950 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం వాటి విలువ సుమారు 11 లక్షల 38000 ఉంటుందని అంచన……

నంద్యాల జిల్లా ఎస్పీ కె .రఘువీర్ రెడ్డి

నంద్యాల యువతరం ప్రతినిధి;

నంద్యాల జిల్లాలో పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యం అక్రమ రవాణాపై జిల్లా ఎస్పీ గారు తీసుకునే చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయని ఒక మే నెలలో జరిగిన దాడులలో మనకు స్పష్ఠంగా కనిపిస్తుంది. జిల్లాలో ఎక్కడ రేషన్ బియ్యం తరలిస్తున్నారు అనే అనుమానం వచ్చిన జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సహాయంతో మరియు సివిల్ పోలీసుల సహాయంతో డకాయి ఆపరేషన్ ద్వారా అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వారిని పై పోలీసులు ఉక్కు పాదం మోపి వారిని జైలుకు పంపించడం జరుగుతుంది

జిల్లాలో ఎక్కడ అక్రమ రేషన్ బియ్యం రవాణా జరిగిన మరియు రవాణా చేయుచున్నారు అనే అనుమానం వచ్చిన అక్కడికి నంద్యాల జిల్లా స్పెషల్ బ్రాంచ్ పోలీసులు అక్కడికి వాలిపోయి పూర్తి సమాచారాన్ని సేకరించి సంబంధిత అధికారులకు చేరవేయుట ద్వారా ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకుంటూ పలు కేసులు నమోదు చేయడం జరిగింది అంతేకాక గత మే నెలలో సుమారు గా అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వారిపై 20 కేసులు నమోదు చేయడం తో పాటు 54 మంది ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగింది అంతేకాక సుమారుగా 950 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పట్టుకోవడం వాటిని సీజ్ చేయడం జరిగింది వాటి యొక్క విలువ 11 లక్షల 38 వేల రూపాయలు ఉంటుందని మరియు గత నెలలో అనగా మే నెలలో అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న 14 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలియజేశారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు అండగా నిలబడుతూ రైతుల నుంచి మద్దతు ధరకు బియ్యాన్ని కొని పేద ప్రజలకు రేషన్ బియ్యాన్ని అందించాలని సదుద్దేశంతో రేషన్ కార్డ్ కలిగిన ప్రతి పేదవారికి తక్కువ ధరకు ధరకు బియ్యాన్ని అందిస్తూ వారి జీవన ప్రమాణ స్థాయిని పెంచాలని చూస్తుండగా ఎవరైనా ప్రజలను మోసగించి లేదా మభ్యపెట్టి ప్రజల వద్ద నుండి రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొన్ని వాటిని అక్రమంగా తరలిస్తున్న వారు ఎవరైనా సరే అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఒకవేళ అక్రమ రేషన్ బియ్యం తరలిస్తున్న వారికి పోలీసులు సహకరిస్తున్నారని తెలిస్తే వారిపై శాఖా పరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని తెలియజేశారు.

నంద్యాల జిల్లా ఏర్పడిన నాటినుండి అనగా 01-04-2022 నుండి 31-05-2023 వరకు నంద్యాల జిల్లాలో పోలీస్ వారు మరియు విజిలెన్స్ రెవెన్యూ వారు ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమ రవాణాపై విస్తృతమైన దారులు చేశారు. ఈ సందర్భంగా PDS రైస్ అక్రమ రవాణా చేయుచున్న మరియు అక్రమంగా కలిగి ఉన్న వారిపై

పోలీస్ డిపార్ట్మెంట్ వారు 315 కేసులు నమోదు చేసి 798 మందిని ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది . అంతేగాక ఈ దారులలో 43,855 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది. వాటి విలువ సుమారు 12,386,236/- రూపాయిలు ఉంటుందని అంచన మరియు అక్రమ రవాణా చేయుచున్న 272 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.

విజిలెన్స్ డిపార్ట్మెంట్ వారు 27 కేసులో నమోదు చేసి 84 మంది ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. వీటితో పాటు 4890 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ 5,509,182/- రూపాయలు ఉంటుందని అంచన మరియు 32 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.

రెవిన్యూ డిపార్ట్మెంట్ వారు 18 కేసులు నమోదు చేసి 44 మంది ముద్దాయిలను పట్టుకోవడం జరిగింది. ఈ దారులలో 1506 క్వింటాల్లో రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం జరిగింది వాటి విలువ సుమారు 2,710,651/- రూపాయలు ఉంటుందని అంచన మరియు 21 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.

జిల్లా మొత్తం మీద పోలీస్ డిపార్ట్మెంట్ ,విజిలెన్స్ డిపార్ట్మెంట్ ,రెవిన్యూ డిపార్ట్మెంట్ అందరు కలిసి ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ ఉంచిన మరియు అక్రమంగా రవాణా చేయుచున్న వారిపై 360 కేసులు నమోదు చేసి 926 మందిని అరెస్టు చేయడం జరిగింది. ఈ దాడులలో 50,252 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్ గా వాటి విలువ సుమారు 20,606,069/- రూపాయలు ఉంటుందని అంచన మరియు రేషన్ బియ్యం అక్రమ రవాణా చేయుచున్న 325 వాహనాలను సీజ్ చేయడం జరిగింది.

నంద్యాల జిల్లాలో అక్రమ మద్యం ,నాటు సారాయి ,అక్రమ రేషన్ బియ్యం, గంజాయి మొదలగు వాటికి సంబంధించి అక్రమ రవాణా చేయుచున్న ఎవరైనా వాటిని అక్రమంగా కలిగి ఉన్న ఏమైనా సమాచారం తెలిసినట్లయితే 9184907023 నంబర్ కు తెలియజేయవచ్చును అన్నారు.సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి అని తెలిపారు.

Yuvatharam News

Related Articles

Back to top button
error: Content is protected !!