ANDHRA PRADESH
జర్నలిస్టులపై దాడులా……?????

జర్నలిస్టులపై దాడులా…..?
పాములపాడు యువతరం విలేఖరి;
- రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులపై జరుగుతున్న దాడుల ఖండిస్తూ పాములపాడు బస్టాండ్ లోని, కేజీ రోడ్డుపై విలేకరులు రాస్తారోకో అనంతరం తహసిల్దార్ రత్న రాధిక కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొందరు దుర్మార్గులు పత్రికా స్వేచ్ఛను కాలరాస్తున్నారని, ఎక్కడ చూసినా కూడా నీతి నిజాయితీగా వార్తలు రాసే విలేకరులపై దౌర్జన్యాలు, దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో విలేకరులపై దాడులు చేసిన దుర్మార్గులను పోలీసులు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి వేతనం ఇవ్వకున్నా స్వచ్ఛందంగా పనిచేస్తున్న విలేకరులకు రక్షణ కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులు తాజా విశేషం, పిఆర్6 ఛానల్ ఎడిటర్ ఆర్.మురళీమోహన్, విఎస్ 369, సీఎంఆర్ ఎడిటర్ వెంకట శివుడు, బిఎస్సి పార్టీ నందికొట్కూరు నియోజకవర్గ ఇంచార్జ్ ఎల్. స్వాములు, సిపిఎం పార్టీ నాయకులు వెంకటేశ్వరరావు, స్వామన్న, సిపిఐ పార్టీ కార్యదర్శి ప్రసాద్, నాయి బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు ఎం.వెంకట రమేష్, సేవా భారతి (వై ఆర్ డి ఎస్) అధ్యక్షుడు ఏపీ టాప్ న్యూస్ ఛానల్ ఉమ్మడి కర్నూలు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎస్.షర్ఫద్దీన్ అలి, దేశ పోరాటం తెలుగు దినపత్రిక నందికొట్కూరు ఇంచార్జ్ ఎస్.అజ్మతుల్లా, కానుక తెలుగు దినపత్రిక నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎన్.చిన్న నాగన్న, అక్షరమాల దినపత్రిక రిపోర్టర్ శివకుమార్ రజక సంఘం మండల అధ్యక్షుడు రామకృష్ణుడు, గౌడ సంఘం మండల అధ్యక్షుడు గాలిగౌడు, మాల మహానాడు నాయకులు అబ్రహం, అంకన్న, మారెన్న, తదితర ప్రజా సంఘాల నాయకులు, విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.