ANDHRA PRADESH
చినుకు పడితే కరెంటు కట్
చినుకు పడితేచాలు కరెంట్ కట్
ఆమడగూరు యువతరం విలేఖరి
మండలంలోని చినగానిపల్లి లైన్ కి చినుకు పడితే చాలు కరెంట్ పోతుందని ఆయా గ్రామ ప్రజలు వాపోతున్నారు.బుధవారం మండల వ్యాప్తంగా కురిసిన వర్షానికి రాత్రి 8:30 కి కట్ అయిన కరెంట్ సప్లై ఆగిపోయింది.గురువారం ఉదయం 11 గంటలకు పైన సప్లై ఆన్ అయిందని తెలిపారు.అమడగూరులో పోలీస్ స్టేషన్ సమీపంలో ట్రాన్స్ పార్మార్ మరమ్మత్తులకు గురి కావడంతో కరెంట్ లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు.రైతులు,దుకాణాదారులు ,టైలర్లు తీవ్ర సమస్యలు ఎదుర్కొన్నారు.తరుచు విద్యుత్ సమస్యలు తలెత్తడానికి ప్రధాన కారణం వైర్లు కింద చెట్లు ఏపుగా పెరగడంతో సమస్యలు తలెత్తు తున్నట్లు తెలిపారు.కావున విద్యుత్ అధికారులు స్పందించి మండలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.