
గడపగడపకు సంక్షేమం ఈ ప్రభుత్వ లక్ష్యం
25వార్డు లో గడప గడపకు మన ప్రభుత్వము కార్యక్రమంలో -కె.కె రాజు
విశాఖ యువతరం ప్రతినిధి;
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గం 25వార్డు రాజేంద్ర నగర్ సచివాలయం 1086133 BTR కోలని,రెల్లివీధి ప్రాంతాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త,రాష్ట్ర నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె రాజు స్టాండింగ్ కమిటీ మెంబర్,25వార్డు కార్పొరేటర్ సారిపిల్లి గోవింద్ తో కలిసి పర్యటించారు.ఈ కార్యక్రమంలో బాగంగా ఇంటింటికి వెళ్ళి ఇప్పటివరకు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలాలను వివరిస్తూ – ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పర్యటించారు.
ఈ సందర్భంగా కె.కె రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వై.యస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు నిష్పక్షపాతంగా అందాలనే ఉద్దేశంతో పని చేస్తున్నారని అన్నారు.ఈ సంక్షేమ ఫలాలు గడపగడపకు అందుతున్నాయా లేదా అని లబ్ధిదారుల వద్ద నుండి తెలుసుకొనుటకు మరియు వారి సమస్యలను వినతుల రూపంలో తీసుకొనుటకు ఈ గడపగడపకు మన ప్రభుత్వము కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆయన గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బాక్సర్ రాజు,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు,డైరెక్టర్ రాయుడు శ్రీను,25వార్డు నాయకులు సానబోయిన సురేష్,బోగవల్లి గోవింద్,సారిపిల్లి సంతోష్,హరికృష్ణ,మువ్వల సంతోష్,సమ్మెట్ల వెంకటేష్,సన్నీ,అశోక్,రవి,గోవిందమ్మ,సీనియర్ నాయకుల షేఖ్ బాబ్జి, యం.సునీల్,కె.చిన్నా,రాము,సచివాలయం సిబ్బంది,వాలంటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.