జగనన్న సురక్ష కార్యక్రమం పై అవగాహన సదస్సు

జగనన్న సురక్ష కార్యక్రమంపై అవగాహన సదస్సు
కౌతాళం యువతరం విలేఖరి;
మండల కేంద్రమైన కౌతాళం లోని ఎంపీడీఓ ఆఫీస్ నందు జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బుధవారం మండల ప్రత్యేక అధికారి లక్ష్మి నారాయణ అధ్యక్షతన జగనన్న సురక్ష కార్యక్రమం పై దహన కార్యక్రమం నిర్వహించారు.విధి విధానాలను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రమణ కాంత రెడ్డి, ఎంపిడివో సుబ్బ రాజు , డిప్యూటీ తహసిల్దార్ రామేశ్వర్ రెడ్డి తదితరులు చర్చించారు. వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులు, పంచాయతి కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ , డిజిటల్ అసిస్టెంట్స్ , మహికా సంరక్షణా కార్యదర్శులు, మరియు వాలంటీర్స్ మొదలగు వారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జి.ఎస్.డబ్ల్యూ.ఎస్ నకు సంబందించిన అన్ని కార్యక్రమాలు డెంగ్యూ, మలేరియా వ్యాధుల నివారణకు చేపట్టు ప్రత్యేక చర్యలు, హౌసింగ్ కార్యక్రమాలు, మన బడి – నాడు నేడు మరియు తదితర అంశాలపై చర్చించడం జరిగింది.