ANDHRA PRADESHBREAKING NEWSSTATE NEWSWORLD
వేళలు పాటించని ఉపాధ్యాయులు

- వేళలు పాటించని ఉపాధ్యాయులు
- విద్యార్థుల ఎదురుచూపు
- వెల్దుర్తి, యువతరం విలేఖరి :
- ఉపాధ్యాయులు, సిబ్బంది సకాలంలో రాక పోవడంతో విద్యార్థులు గేటుకు తాళం వేసిన పాఠశాల ముందు బయటే కూర్చుని ఎదురు చూస్తున్న సంఘటన మండల కేంద్రమైన వెల్దుర్తిలోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్లో బుధవారం చోటుచేసుకుంది. ఎండ వేడిమి అధికంగా ఉండడంతో ప్రభుత్వం పాఠశాలను ఒంటి పూట బడులుగా మార్చింది. ఉదయం 7:30 నుండి 11:30 గంటల వరకు పాఠశాల సమయంగా ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ఉదయం 7:30 గంటలకు పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాఠశాలలకు రావాల్సి ఉంది. కానీ ఇక్కడ అయ్యవారులే సమయపాలన పాటించడం లేదు. ఇక సిబ్బంది ఏమీ సమయపాలన పాటిస్తారు. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ తప్పితే చర్యలు ఎవరు తీసుకోవాలి. సకాలంలో ఉపాధ్యాయులు రాకపోతే విద్యార్థుల సకాలంలో ఎలా వస్తారు అన్నది ప్రశ్న. అయ్యవారులు పాఠశాలకు రావడమే ఆలస్యం మరి విద్యార్థులతో ప్రార్థన ఎప్పుడు చేయించాలి. బుధవారం మండల కేంద్రమైన వెల్దుర్తి లోని జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ లో ఉదయం 7:30 గంటల ప్రాంతంలో గేటు వేసిన పాఠశాల ముందు విద్యార్థులు దిగాలుగా కూర్చున్న దృశ్యం అగుబడింది. పాఠశాల లోపలికి వెళ్లి చూస్తే ఉదయం 7:30 గంటలు సమయానికి విద్యార్థులతోపాటు ఒక్క ఉపాధ్యాయురాలు మాత్రమే రావడం జరిగింది. పాఠశాల తాళాలు లేకపోవడంతో ఉపాధ్యాయురాలు కూడా బయటే ఉండిపోయింది. విద్యార్థులు ఏం చేయాలో దిక్కుతోచక అలాగే కూర్చుండి పోయారు. మండల కేంద్రమైన వెల్దుర్తి లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మండలంలో మారుమూల ప్రాంతాలలో ఉన్న పాఠశాలలో ఎలాంటి దుస్థితి ఉంటుందో ఆలోచించుకోవచ్చు. ఉదయం 7:30 గంటల సమయానికి కొంతమంది ఉపాధ్యాయులు పాత బస్టాండు మరియు ఆటో స్టాండ్ ల వద్ద ఉంటున్నట్లు మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. వీరు పాఠశాలలకు ఎప్పుడు వెళ్లాలి, విద్యార్థులకు విద్యాబుద్ధులు ఎప్పుడు నేర్పించాలి అన్నది ప్రశ్న. వీరికి మండలానికి కలిసి ఇద్దరు మండల విద్యాశాఖా అధికారులు ఉన్నారు. పాఠశాల సమయానికి ఉపాధ్యాయులు రాకపోతే మండల విద్యాశాఖ ఆధికారులు ఏమి చేస్తున్నారని మండల ప్రజల ప్రశ్నిస్తున్నారు. ఇలా అయితే తమ చిన్నారులకు విద్యాబుద్ధులు ఏమి వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఒకపక్క ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తుంటే ఉపాధ్యాయులు మాత్రం తమకేమీ పట్టనట్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం సోచనీయం. మండల విద్యాశాఖ అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏమి బదులిస్తారు. ఉపాధ్యాయులు సకాలంలో వస్తున్నారా లేదా అని ఆయా పాఠశాలను మండల విద్యాశాఖ అధికారులు పరిశీలించవలసిన అవసరం ఉందా లేదా. అలా పరిశీలిస్తుంటే మండల కేంద్రమైన వెల్దుర్తి లో ఇలాంటి దుస్థితి ఎందుకు నెలకొంటుందని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో వెల్దుర్తిలో ఉత్తీర్ణత శాతం అంతంత మాత్రమే. ఇలా ఉపాధ్యాయులు ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తే విద్యార్థులకు విద్యాబుద్ధులు ఎప్పుడు నేర్పించాలి. ఇలా మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు వ్యవహరిస్తే ఈసారి పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం ఎంత వస్తుందో వేచి చూడవలసిందే. గత విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం తగ్గింది, ఈ విద్యా సంవత్సరంలోనైనా పదవ తరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని ఉంటే మండల విద్యాశాఖ అధికారులు మరియు ఉపాధ్యాయులు చేపట్టే చర్యలు ఇవేనా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెల్దుర్తి జిల్లా పరిషత్ బాలుర హైస్కూల్ కు కొత్త హెడ్మాస్టర్ వచ్చిన తీరు మారకపోవడం గమనర్హం. భావి భారత పౌరులకు క్రమశిక్షణ నేర్పించాల్సిన ఉపాధ్యాయులే క్రమశిక్షణ మర్చిపోతే ఎలా అని మండల ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు కల్పించుకొని పాఠశాలలు వేళలకు తెరుచుకునేలా తగు చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.