విత్తన దుకాణాల తనిఖీ

విత్తన దుకాణాల తనిఖీ
వెల్దుర్తి యువతరం విలేఖరి;
మండల కేంద్రం అయిన వెల్దుర్తిలోని బాలాజీ సీడ్స్ మరియు పేష్టిసిడ్స్, శ్రీ శివ సాయి ట్రేడర్స్, ధరణి ఫర్టిలైజర్స్ మరియు లక్ష్మి నరసింహ ట్రేడర్స్ లను బుధవారం మండల వ్యవసాయ అధికారి అక్బర్ బాషా తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమతి ఉన్న విత్తనాన్ని మాత్రమే విక్రాయించాలి అని సూచించారు. ఎమ్మార్పీ కి మించి విత్తనాన్ని విక్రాయించకూడదు అని హెచ్చరించారు.
రైతులు కోరిన విత్తనాన్ని మాత్రమే ఇవ్వలని ఆదేశించడం జరిగింది.
దుకాణములో స్థాకు రిజిస్టర్లు, బిల్ బుక్స్ మరియు స్థాకు బోర్డ్స్ ను తనిఖీ చేయడం జరిగింది.
దుకాణములో ఉన్న వివిధ కంపినీల ప్రత్తి, కంది, ఆముదము మరియు కూరగాయల విత్తనాలను తనిఖీ చేయడము జరిగింది.
రైతులకు విత్తనాలు విక్రయించేటప్పుడు తప్పనిసరిగా లాట్ నెంబరు మరియు ఇతర సమాచారాన్ని కనబర్చి బిల్ ఇవ్వాలని ఆదేశించడం జరిగింది.
అనుమతి లేని విత్తనాలు రైతులకు అమ్మితే అట్టి వారి పై విత్తన చట్ట ప్రకారము చర్యలు తీసుకొనబడును అని హెచ్చరించారు.