గస్తీని పటిష్టంగా అమలు చేయాలి, ఎస్ పి జి కృష్ణ కాంత్

గస్తీని పటిష్టంగా అమలు చేయాలి…. జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్
కర్నూలు యువతరం ప్రతినిధి;
జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో 92 మంది సిసిటిఎన్ఎస్ పోలీసులతో ఈ – బీట్స్ పై శిక్షణ కు జిల్లా ఎస్పీ జి. కృష్ణకాంత్ బుధవారం ఒక రోజు వర్క్ షాప్ నిర్వహించారు.
ఈ సంధర్బంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ
జిల్లాలో ఈ – బీట్స్ (గస్తీ) పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
ప్రజల భద్రతే లక్ష్యంగా రాత్రి, పగటి గస్తీ లు నిర్వహిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు.
ఒక రోజు శిక్షణ లో సిసిటిఎన్ఎస్ కంప్యూటర్ పోలీసులు నేర్చుకున్న విషయాలను తమ యొక్క పోలీసుస్టేషన్ లలో గస్తీ కి వెళ్ళే పోలీసు అధికారులు, సిబ్బంది యొక్క మొబైల్ ఫోన్ లలో వాళ్ళ యొక్క సి ఎఫ్ ఎం ఎస్ ఐ డి క్ తో ఈ – బీట్ సిస్టమ్ ను ఇన్ స్టాల్ చేయించాలన్నారు.
జూన్ 24 వ తేది లోపు ఈ – బీట్ సిస్టమ్ జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్ లలో అమలులో ఉండాలన్నారు.
ఆయా సబ్ డివిజన్ ల పరిధిలలో బీట్ పాయింట్స్, రౌడీషీటర్స్, చెడు ప్రవర్తన గల వారి ఇళ్ళను, ప్రదేశాలను గుర్తించి ఈ – బీట్స్ బాగా చేయాలన్నారు.
జిల్లా హెడ్ క్వార్టర్ నుండి ఈ – బీట్ సిస్టమ్ ను మానిటరింగ్ చేస్తుంటారన్నారు.
ఈ కార్యక్రమంలో సిఐలు అబ్దుల్ గౌస్, గుణశేఖర్ బాబు, రామయ్యనాయుడు, మనోహర్ పాల్గొన్నారు.