మండల విద్యాధికారిని సత్కరించిన యుటిఎఫ్ నాయకులు

మండల విద్యాధికారిని సత్కరించిన యుటిఎఫ్ నాయకులు
ప్యాపిలి, జూన్ 20, (యువతరం న్యూస్ ) :
ప్యాపిలి మండల విద్యాశాఖాధికారిగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేష్ నాయక్ ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియ చేసినట్లు యుటిఎఫ్ ప్యాపిలి మండల ప్రధాన కార్యదర్శి నరసింహారెడ్డి,సీనియర్ నాయకులు అబ్దుల్ లతీఫ్ తెలిపారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో ఉన్న వివిధ రకాల సమస్యలు తెలియచేసినట్లు తెలిపారు. మన బడి నాడు నేడు మొదటి దశ పనులు నిర్వర్తించిన ప్రధానోపాధ్యాయులకు వారి సేవా పుస్తకంలో 15 రోజుల ప్రత్యేక సెలవులను వెంటనే నమోదు చేయాలని కోరారు,మండలంలోని పలు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య బట్టి ఉపాధ్యాయులు లేరని కావున పని సర్దుబాటు కింద ఉపాధ్యాయులను కేటాయించే సందర్భంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఆధారంగా చేసుకుని సర్దుబాటు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అన్వర్,జిల్లా కౌన్సిలర్లు అంజనప్ప,రమేష్ నాయుడు,సర్వజ్ఞ మూర్తి, ఆంజనేయ ప్రసాద్, మండల ఆర్థిక కార్యదర్శి రాజేంద్ర, షేక్షావలి, నరసింహయ్య, నాగమణి,లక్ష్మి,ఆస్మా,లక్ష్మీ దేవి,మహబూబ్ బాషా,కీర్తి చందర్,శాంతి కుమార్,హరి ప్రసాద్,రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు