
వెల్దుర్తి, జూన్ 13, (యువతరం న్యూస్) :
వెల్దుర్తిమండలంలోని కలుగొట్ల గ్రామంలో సోమవారం ట్రాక్టర్ బోల్తా పడినా సంఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ కు మరొక యువకునికి గాయాలు అయినట్టు సమాచారం. స్థానికులు తెలిపిన వివరాల ఇలా ఉన్నాయి. ట్రాక్టర్ మట్టి తీసుకొని వస్తున్నసమయంలో కటింగురావడంతో సడన్గా బ్రేక్ వేయగా ట్రాలీ, ఇంజన్ బోల్తా పడినట్టుస్థానికులు తెలిపారు. గాయపడిన ఇరువురువైద్యం కోసంకర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లినట్టుతెలిపారు. ఇరువురువెల్దుర్తి మండలం నరసాపురం గ్రామనికి చెందినవారీగా గుర్తించారు. ఈప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు.