ANDHRA PRADESHBREAKING NEWSCRIME NEWSHEALTH NEWSLIVE TVMOVIESPOLITICSSOCIAL MEDIASPORTS NEWSSTATE NEWSTELANGANA

ఏరువాక పౌర్ణమి-ఎద్దుల పారువేట ఉత్సవాలు

ఏరువాక పౌర్ణమి-ఎద్దుల పారువేట ఉత్సవాలు

పత్తికొండ, జూన్ 13, (యువతరం న్యూస్) :

పత్తికొండ నియోజక వర్గ రెవెన్యూ డివిజన్ పరిధి లో గల పత్తికొండ మండలం లోని హోసూరు గ్రామం లో జూన్ 3 వ తారీకు న ఏరువాక పౌర్ణమి సందర్బంగా అనాది నుండి సాంప్రదాయంగా వస్తున్న ఎద్దుల పారువేట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏరువాక పౌర్ణమి సందర్బంగా ఎద్దుల పారువేట అనగా గ్రామం లోని ఎద్దులకు రైతులు రంగులు కొట్టి సాయంత్రం గ్రామం లోని ఎద్దులకు పరుగు పందెం నిర్వహిస్తారు, పరుగు పందెం లో గెలుపొందిన ఎద్దులను ఆరోజు ఊరిలో ఊరేగింపు చేస్తారు ఈ సాంప్రదాయం పూర్వకాలం నుండి వస్తున్న అనవాయితీ అని హోసూరు గ్రామ పెద్దలు తెలియజేశారు. హోసూరు లో పారువేట లో గెలుపొందిన ఎద్దుకు బీజేపీ అధ్యక్షుడు బ్రహ్మయ్య, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం నాయకులు వెంకటేశ్వరులు పూలమాల తో సన్మానించారు.

YUVATHARAM NEWS

Related Articles

Back to top button
error: Content is protected !!